ములుగు జిల్లాలో మంత్రి పర్యటన…

గట్టమ్మ దేవతను మేడారం అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్,అధికారులు

అమ్మవార్లకు బతుకమ్మ చీరలను సమర్పించిన తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.

ములుగు బ్యూరో,సెప్టెంబర్22(జనం సాక్షి):-

ములుగు జిల్లాలో గట్టమ్మ దేవతను,మేడారం అమ్మవార్లను దర్శించుకుని అమ్మవార్లకు స్థానిక జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ తో కలిసి బతుకమ్మ చీరలను సమర్పించిన తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక తండ్రిలా,అన్నలా బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ బతుకమ్మ చీరలను కానుకగా అందిస్తున్నారు.సీఎం కేసీఆర్ కి మహిళా సోదరీమణులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మరమగ్గ నేతన్నలకు ఉపాధి కల్పించటంతోపాటు అడపడుచులకు ప్రేమపూర్వక చిరుకానుక అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.సీఎం కేసీఆర్ ప్రతి ఏడాది బతుకమ్మ చీరల కోసం 339 కోట్ల రూపాయలు వెచ్చించి, 10 రంగులు 18 డిజైన్లలో 200 రకాల చీరలను ఆడబిడ్డలందరికీ బతుకమ్మ కానుకగా అందిస్తున్నారు.బతుకమ్మ చీరలతో నేతన్నల ఆదాయం రెట్టింపు అవుతుంది.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్క వర్గం సగర్వంగా బ్రతికే విధంగా సమాన దృష్టితో చూస్తున్నారు.దేశంలో మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.
త్వరలో కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్టు ప్రారంభించుకోబోతున్నాం.కొంతమంది రాజకీయ లబ్ధి కోసం అవాకులు చెవాకులు పేలుతున్నారు.మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్న.., మీరు అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా…దేశ సంపదను ప్రైవేటు సంస్థలకు దోచి పెట్టడానికి కేంద్రం కంకణం కట్టుకుంది.తెలంగాణ రాష్ట్రం గురించి గానీ, ఇక్కడి పరిపాలన గురించి గానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు.
వీరి వెంట జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య, ఐటిడిఎ పిఓ అంకిత్,స్థానిక ప్రజా ప్రతినిధులు మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శివయ్య,జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, ఎంపీపీ గొందివాణిశ్రీ,మేడారం సర్పంచ్, వెంగలాపూర్ సర్పంచ్ మరియు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు గడ్డం అరుణ,స్థానిక పార్టీ శ్రేనులు పోరిక గోవిందు నాయక్,ఆదిరెడ్డి,వేల్పూరి సత్యనారాయణ, దిడ్డి మోహన్ రావు,ఇంద్రా రెడ్డి,దండుగుల మల్లయ్య,రజినీకర్ తదతరులు పాల్గొన్నారు.
2
Attachments
• Scanned by Gmail