ముషీరాబాద్‌లో 144 సెక్షన్‌

హైదరాబాద్‌: ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఉదయం 6 గంటల నుంచి అక్కడ 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు నగర కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలియజేశారు.