మూడోసారి శాసనసభ వాయిదా

హైదరాబాద్‌: సమావేశాలు చివరి రోజు శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. రెండుసార్లు వాయిదా పడ్డ అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో మళ్లీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.తెలంగాణపై తీర్మానానికి టీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి వారు నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్‌ సభను అరగంట పాటు వాయిదా వేశారు.