మూడో రోజూ తెలంగాణ దద్దరిల్లిన అసెంబ్లీ

హైదరాబాద్‌: రాష్ట్ర శాసన సభ ఇవాళ కూడా తెలంగాణ అంశంపై దద్దరిల్లింది. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్లాల్సిందేనని టీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుబట్టడంతో ఇవాళ కూడా సభ సజావుగా సాగలేదు, ఉదయం  ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం వరకు  సభ నాలుగైదు సార్లు వాయిదా పడింది. టీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసనలు, నినాదాలతొ సభ మారుమోగింది. సభ తిరిగి ప్రారంభంమైన ప్రతిసారి టీఆర్‌ఎస్‌ సభ్యులు స్పీకర్‌ వెల్‌లోకి దూసుకుపోయి నినాదాలు చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. టీఆర్‌ఎస్‌కు తోడు నాగం, బీజేపీ. సీపీఐ సభ్యులు సభలో తెలంగాణపై గొంతెత్తారు. మంత్రి విద్యుత్‌, ఇతర ప్రజా సమస్యలపై చర్చిద్దామని మంత్రి శ్రీధర్‌బాబు బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తెలంగాణ సమస్య కోసం సభలో 5 నిమిషాలు సమయం కేటాయించి తీర్మానం ప్రవేశపెడితే మిగత సమస్యలపై చర్చిద్దామని టీఆర్‌ఎస్‌ పట్టుబట్టడంతో గత్యంతరం లేక స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.