మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
మోత్కూరు మార్చి 21 జనంసాక్షి : మున్సిపాలిటీ కేంద్రంలోని 6 వ వార్డ్ ఇందిరానగర్ కాలనీకి చెందిన జిట్ట బాలక్రిష్ణ (26) భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి సమీపంలో ఆదివారం రోజున రైల్ కింద పడి మృతి చెందగా మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి 5000 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సి, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి తిరుమలేష్. ఈ కార్యక్రమంలో జిట్ట సోమయ్య, గడ్డం చెంద్రయ్య, కందుకూరి బిక్షం, దాసరి నరేష్, జిట్ట మహేందర్, దాసరి కనుకయ్య, గడ్డం స్వామి, కందుకూరి యాకులు, రామచెంద్రు, కొంగరి మల్లేష్, జిట్ట సాయి కుమార్, దాసరి నవీన్ కుమార్, లక్ష్మయ్య, మల్లేష్, మహేష్, నర్సయ్య, శ్రీను తదితరులు గ్రామస్తులు ఉన్నారు.