మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

 

 

 

 

 

 

 

 

 

మోత్కూరు మార్చి 11 జనంసాక్షి : మండలంలోని దాచారం గ్రామానికి చెందిన సూరారం వెంకటమ్మ శుక్రవారం రాత్రి మృతి చెందడంతో దాచారం గ్రామ సర్పంచ్ అండం రజిత రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కడమంచి వస్తాద్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి సర్పంచి అండం రజిత రాజిరెడ్డి ఐదువేల రూపాయలు, వస్తాద్ ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంగపండ్ల మల్లయ్య, మాజీ సర్పంచ్ జినుకల మల్లయ్య, మాజీ ఉపసర్పంచ్ కప్పల లింగయ్య, బిఆర్ఎస్ నాయకులు జినుకల యాదగిరి,బోనుగ నరేందర్ రెడ్డి ,దబెటి సుధాకర్ ,మర్రి లింగయ్య, శ్రీరాముల యాదగిరి జలా నరేష్ తదితరులు పాల్గొన్నారు.