మెదక్లో ఘోర రోడ్డు ప్రమాదం
మెదక్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ఆటోను, లారీ ఢీకొని ఆరుగురు మృతి చెందినట్లు తెలిసింది. సంగారెడ్డి మండలంలోని కంది- హైదరాబాద్ ఐఐటీ మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో మొత్తం 9మంది ప్రయాణిస్తుండగా ప్రమాద స్థలంలోనే ఆరుగురు మృతిచెందారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిని వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు.