మెదక్‌ జిల్లాలో రోడ్డుప్రమాదం

మెదక్‌; మెదక్‌ జిల్లా కొహిర్‌ మండలం దిగ్వాల్‌ గ్రామ సమీపంలో 65వ నంబర్‌ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్వక్తి దుర్మరణం చెందగా… 18 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి ముంబయి వెళ్తున్న డీసీఎం… షిర్డీ నుంచి హైదరాబార్‌ వస్తున్న ఏపీ టూరిజం వాల్వో బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం క్లీనర్‌ అక్కడికక్కడే మరణించగా… గాయపడిన ప్రయాణికులకు జహీరాబాద్‌ ప్రాంతీయ అస్పత్రికి తరలించారు. రోడ్డుప్రమాదంతో ముంబయి-హైదరాబాద్‌ మార్గంలో రాకపోకలు తీవ్రంగా స్తంభించాయి. పోలీసులు రవాణా వ్వవస్ధను పునరుద్ధరిస్తున్నారు.