మేడ్చెల్‌ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

హైదరాబాద్‌, మార్చి 22: మేడ్చెల్‌ హైవేపై ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న రెండు బైక్‌లను వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు ద్విచక్రవాహనదారులు మృతిచెందారు. మృతదేహాల్ని స్వాధీనపరుచుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.