మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ ఫలితాలు విడుదల

విజయవాడ: ఈ ఏడాది జూన్‌-జులైలో జరిగిన మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. భారతీయ వైద్యమండలి మార్గనిర్దేశకాల మేరకు ఐదు గ్రేన్‌ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేసినట్లు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ డి. విజయకుమార్‌ తెలిపారు.