మొన్న ముంబయి సచివాలయం.. నిన్న పార్లమెంట్‌

నార్త్‌బ్లాక్‌లో అగ్నిప్రమాదం
హోంశాఖకు చెందిన ఫైళ్లు దగ్ధం..
న్యూఢిల్లీ : పార్లమెంటు భవనం..నార్త్‌బ్లాక్‌లో ఆదివారం మధ్యాహ్నం సుమారుగా 2గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభ వించింది. నార్త్‌బ్లాక్‌లోని రెండో ఫ్లోర్‌లోని హోం శాఖ కార్యా లయం లో అగ్నిప్రమాదం చోటు చేసు కుంది. హోంమంత్రిత్వ శాఖ గదికి పక్కన ఉన్న మీటింగ్‌ హాల్‌లో అగ్నిప్రమాదం సంభవిం చింది. పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అం దుకున్న ఆరు ఫైరింజన్లు శ్రమించాయి. కొద్దిసే పటికి మంటలు అదుపులోకి వచ్చాయి. సెలవుదినం కావడంతో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం చోటు చేసుకోలేదు. ఆస్తినష్టం జరిగింది. ఫైళ్లు దగ్ధమైనట్టు సమాచారం. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న కొందరు అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా షార్టుసర్క్యూట్‌ వల్లే ప్రమాదం సంభవించిఉండొచ్చని అగ్నిమాపక కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.