దొంగగా మారిన పాస్టర్..

ఓనర్ ఇంటికి తాళం.. అద్దె ఇంటి పాస్టర్ దొంగతనం.
అరెస్టు చేసి రిమాండ్ చేసిన పోలీసులు.
ఆర్మూర్,జనవరి 27 (జనంసాక్షి): క్రిస్టియన్ భక్తుల విశ్వాసాన్ని పెంచి పాస్టర్ గా వ్యవహరించాల్సిన వారే దొంగగా మారి దొంగతనానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాలలోకి వెళ్తే..ఆర్మూర్ మండలంలోని మిర్ధపల్లి గ్రామంలో రంజిత్ పాస్టర్ గా ఉంటున్నాడు. ఆర్మూర్ పట్టణంలో ఓ అద్దె ఇంటిలో జీవనం కొనసాగిస్తున్నాడు.ఇంటి ఓనర్ కుటుంబం ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం వెళ్లారు.ఇదే అదునుగా భావించి పాస్టర్ ఓనర్ ఇంటి తాళాలు పగలగొట్టి పాస్టర్ రంజిత్ రూ.ఐదు లక్షల నగదు,7 తులాల బంగారం ఉన్న కాడికి కాజేశాడు.ఇంటి యజమానికి దొంగతనం తీరుపై అనుమానం రావడంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.పోలీసులు దొంగతనం జరిగిన తీరును క్షుణ్ణంగా కలిసి పరిశీలించి అద్దె ఇంటి దొంగను పట్టుకున్నారు.పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో పాస్టర్ అసలు నిజం బయటపెట్టాడు.రూ.5 లక్షల కోసం దొంగగా మారిన పాస్టర్ నిజస్వరూపం బయటపడింది.
పై విషయనుసారం పోలీసులను వివరాలు అడగగా.. ఐదు లక్షల రూపాయలు దొంగలించినట్లు చెప్పారు.బంగారం నకిలీదని వివరాలు వెల్లడించారు.తదుపరి దొంగను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.



