మొబైల్లో ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో వెబ్‌సైట్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వం అధికారిక సమాచారం, తాజా ప్రకటనలు వెల్లడించే ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో వెబ్‌సైట్‌ మొబైల్‌ వర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. హైచ్‌టీటీ పి://పీఐబీ.జీవోవీ.ఐఎన్‌/ఎంఓబీఐఎల్‌ఈ అనే యూఆర్‌ఎల్‌ని మొబైల్లోని బ్రౌజర్లో టైవ్‌ చేస్తే ఈ వెబ్‌సైట్‌ వస్తుంది. ఈ మేరకు సమాచారం, ప్రసారాల శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ మొబైల& వెర్షన్‌లో ప్రస్తుతం ఇంగ్లీష్‌ వెబ్‌సైట్‌ మాత్రమే ఉంది. హిందీ, ఉర్దూ వెర్షన్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.