యశస్విని ఇంటివద్ద పోలీసులు మొహరింపు

మహబూబాబాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి):  పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని రెడ్డి నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. యశస్విని రెడ్డి అత్త, ఎన్నారై రaాన్సీరెడ్డి స్థానికేతరురాలని, బయటకు రావొద్దని ఇప్పటికే  పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించారన్న ఆరోపణతో పోలీసులు రaాన్సీరెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే రaాన్సీరెడ్డిని అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.