యాత్రకు బయల్దేరేముందు వైద్య పరీక్షలు

శ్రీనగర్‌:అమరనాథ్‌ యాత్రకు బయల్దేరే ముందు యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలని జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వ శుక్రవారం విజ్ఞప్తి చేసింది.బాల్తాల్‌ పహల్‌గావ్‌ బేస్‌క్యాంపుల వద్ద వైద్య పరీక్షలు చేయించుకుని బయల్దేరవసిందిగా ప్రభుత్వం యాత్రికులను కోరింది.శుక్రవారం నాటికి ఈ యాత్రలో మరణించిన వారి సంఖ్య 72కు చేరింది.అధికశాతం మరణాలు కార్డియాక్‌ అరెస్టు వల్లే సంభవిస్తున్నాయని అధికారులు తెలిపారు.