యువకుడి దారుణహత్య

నెల్లూరు, జూలై 18 : నగరంలోని వైఎంసిఎ గ్రౌండులో పి.మధు (23) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ యువకుడు ఏ ప్రాంతానికి చెందిన వాడనేది తెలియరాలేదని పోలీసులు వివరించారు. సుమారు 10 గంటల ప్రాంతంలో గ్రౌండుకు ఎదురుగా ఉన్న మద్యం దుకాణంలో మరో ముగ్గురితో కలిసి మధు గ్రౌండులో మద్యం సేవించారు. ఆ సమయంలో వారి మధ్య చిన్నపాటి గొడవ ఏర్పడడంతో ఈ హత్యకు దారితీయవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మధు హత్యకు పాతకక్షలే కారణమై ఉండవచ్చని కూడా పోలీసులు అన్నారు. కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.