యువత దేశానికి మంచి పేరు తీసుకరావాలి : చంచల్ గూడ జైలు సూరింటెండెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) అత్యంత ఎత్తైన రెండు పర్వతాలను 10రోజులలో గత నెల 14న ఆఫ్రికా ఖండంలోనే కిలిమంజారోను, 24న యూరప్ లోని ఎల్బ్రస్ పర్వతాలను అధిరోహించిన వై. నితిన్ ను శుక్రవారం చంచల్ గూడ జైలు సూరింటెండెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..
ఎతైన పర్వతాలను అధిరోహించి ప్రతిభను కనబరుస్తూన్న యువత దేశానికి మంచి పేరు తెచ్చుకోవాలి అని అన్నారు వారిని శాలువాతో సత్కరించారు… ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండ యాదగిరి, గౌర శ్రీనివాస్ కురుమ గుండబోయిన చందు యాదవ్ పాల్గొన్నారు…