యువ నాయకులు చింతల గట్టు శివరాజ్ ఏర్పాటు
చేసిన చలి వేంద్రాన్ని ప్రారంభించిన-ఎమ్మెల్యే మాణిక్ రావుయువ నాయకులు చింతల గట్టు శివరాజ్ ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ప్రారంభించిన-ఎమ్మెల్యే మాణిక్ రావుపెన్ గన్ న్యూస్ / ఝరసంగం; మండలం లోని కొల్లూరు గ్రామం మరియు మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ సందర్బముగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దూర ప్రయాణాలు చేసేవారికి, పాదచారుల దాహర్తి తీర్చే ఉద్దేశ్యంతో ఈ చలివేంద్రం ఏర్పాటుచేయటం చాలా గొప్ప విషయమని తెలియచేసారు. అలాగే ఎండలు తీవ్రమవుతున్న సమయంలో ప్రతి మనిషి రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తప్పనిసరిగా త్రాగాలి, రహదారుల పై ఎండల్లో ప్రయాణించే ప్రతివారు తగుజాగ్రత్తలు పాటించాలన్నారు. ఇలాంటి సమయాల్లో చలివేంద్రాలు బాగా ఉపయోగ పడతాయన్నారు. దప్పికతో ఉన్న వారికి గుక్కెడు మంచినీరు అందిస్తే ఎంతో పుణ్యం వస్తుందని అన్నారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ యువ నాయకులు శివరాజు కి అభినందించారు.ఈ కార్యక్రమంలో పెన్ గన్ ఎడిటర్ రాయకోటి నరసింహులు,జహీరాబాద్ జాగృతి కన్వీనర్ తెలుగు పాండు, స్వేరోస్ చార్మినార్ జోన్ ఉపాధ్యక్షులు గడ్డ వారి రత్నం,సర్పంచుల ఫోరం అధ్యక్షులు జగదీశ్వర్ పటేల్, కొల్లూరు గ్రామ సర్పంచ్ భర్త బస్వరాజ్, గ్రామ ఎంపీటీసీ భర్త రాజు, ఉపసర్పంచులు శివశంకర్, మాణిక్ యాదవ్,ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు నాయకులు రాంపూర్ ప్రకాష్,జగన్, టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ పెద్ద గొల్ల నారాయణ,పట్టణ మైనారిటీ అద్యక్షుడు ఏజజ్ బాబా,మాజీ సర్పంచ్ వెంకటేష్ టీఆర్ఎస్ యువ నాయకులు ప్రవీణ్,సోయల్,పాస్టర్ రాజేందర్ జైపాల్, తదితరులు పాల్గొన్నారు.