యూపీఏ నుంచి వైదొలిగిన డీఎంకే

చెన్నై : యూపీఏ ప్రభుత్వం నుంచి డీఎంకే వైదొలిగింది. శ్రీలంకలో తమిళుల హక్కుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంకే అధినేత కరుణానిధి చెన్నైలో వెల్లడించారు. కేంద్ర మంత్రివర్గం నుంచి డీఎంకేకు చెందిన ఐదుగురు మంత్రులు రాజీనామా చేయనున్నట్లు చెప్పారు. యూపీఏ నుంచి అన్ని సంబంధాలు తెగతెంచుకుంటున్నామని స్పష్టం చేశారు. జెనీవాలో జరగనున్న ఐరాస మానవహక్కుల సమావేశంలో శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఆయన కేంద్రాన్ని మరోసారి డిమాండ్‌ చేశారు. 18 మంది ఎంపీల బలం ఉన్న డీఎంకే యూపీఏలో రెండో అతిపెద్ద భాగస్వామి. డీఎంకే నిర్ణయంతో యూపీఏ సర్కారు ఇరకాటంలో పడింది.