యూపీఏ పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగింది : కిషన్‌రెడ్డి
హైదరాబాద్: అవినీతి పాలన, అసమర్థ నాయకత్వం, తదితర సమస్యలతో దేశం క్లిస్ట పరిస్థితుల్లో ఉందని ఈ సమస్యల్ని పరిష్కరించగల సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో భాజపా నేతృత్వంలో సమర్థ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, యూపీఏ పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని లక్షల కోట్ల ప్రజాధనం లూటీ జరిగిందంటూ ధ్వజమెత్తారు. అసమర్థ నాయకత్వాన్ని అంటగట్టడంతో ప్రపంచదేశాల దృష్టిలో దేశం పరువుపోతోందని ఆవేదన వ్వక్తం చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ ప్రధానమంత్రి పరిపాలన సాగిస్తున్నారో, లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు.