రంగారావు క్షమాభిక్ష అభ్యర్థనకు కోర్టు అంగీకారం

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో తనను క్షమించాలన్న తుమ్మల రంగారావు అభ్యర్థనను సీబీఐ కోర్టు అంగీకరించింది. మెజిస్ట్రేట్‌ ఎదుట ఇచ్చిన 164 వాంగ్మూలానికి కట్టుబడి ఉండాలని రంగారావుకు కోర్టు షరతు విధించింది.ఆయనను అపరాధసాక్షిగా పరిగణిస్తూ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. షరతు ఉల్లంఘిస్తే మళ్లీ విచారణను ఎదరుర్కొనవలసి ఉంటుందని రంగారావుకు కోర్టు స్పష్టం చేసింది.