రమాకాంత్ రెడ్డి ని సన్మానించిన ఎమ్మెల్యే

శివ్వంపేట సెప్టెంబర్ 29 జనంసాక్షి : శివంపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులు కొత్తపేట వాస్తవ్యులు రేవా రమాకాంత్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో గురువారం  టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సారా శేఖర్ గౌడ్ ఇతర నాయకులు రమాకాంత్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి ని కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, రమాకాంత్ ను శాలువాతో సన్మానించారు. టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ నాయిని వేణుగోపాల్ రెడ్డి, సారా పాండు, పైనం సందీప్ సర్పంచ్ చెన్నానాయక్  అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రామ కాంత్ రెడ్డిని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి కృపతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.