రవాణా శాఖ దాడులు కొనసాగుతాయి

కమిషనర్‌ సంజయ్‌కుమార్‌
హైదరాబాద్‌ : ప్రైవేటు ట్రావెల్స్‌ పాఠశాల బస్సులపై దాడులు కొనసాగుతాయని రవాణా శాఖ కమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్నవారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 356 ప్రైవేటు ట్రావెల్స్‌, 1518 పాఠశాల బస్సులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 858 ప్రైవేటు ట్రావెల్స్‌, 1849 పాఠశాల బస్సులపై కేసులు నమోదు చేసినట్లు కమిషనర్‌ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బస్సులపై ఆయా కోర్టుల్లో చార్జిషీటు దాఖలుచేయనున్నట్లు సంజయ్‌కుమార్‌ తెలిపారు.