రవిచంద్ర,ఆదిత్యకు బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ కేసులో ఇద్దరికి బెయిల్‌ మంజూరైంది. పట్టాభి రామారావు తనయుడు రవిచంద్ర, న్యాయవాది ఆదిత్యకు ఏసీబీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మరో ఆరుగురి నిందితుల బెయిల్‌ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. సోమశేకర్‌రెడ్డి, దశరథరామిరెడ్డి, యాదగిరిరావు, పట్టాభి రామారావు, సురేష్‌బాబు, చలపతిరావుల బెయిల్‌ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.