రష్యాలో వరదభీభత్సం : 100 మంది మృతి

మాస్కో: రష్యాలోని దక్షిణాది ప్రాంతమైన క్రాస్నొదార్‌లో ఆకస్మికంగా విరుచుకుపడిన వరదల్లో వందమంది మరణించారు. దాదాపు 13 వేల మంది నిరాశ్రయులైనారు. శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటనలో ఒక్కసారిగా 7 మీటర్ల ఎతైన అల విరుచుకుపడి ఇళ్ళూ, వాహనాలు ఒట్టుకు పోయాయి. నల్ల సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతానికి జులై నెలలో సందర్శకుల తాకిడి ఎక్కువ. పలు గ్రామాలు నీటమునిగి మృతుల సంఖ్య బాగా పెరిగింది.