రహదారులకు ఇరువైపులా మొక్కల పెంపకం

సత్ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వ ప్రణాళిక

హైదరాబాద్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): హరితహారం కింద రహదారుల వెంట మొక్కలు నాటాలన్న సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో ఇక రోడ్లు పచ్చగా దర్శనమివ్వనున్నాయి. గతేడాది చేపట్టిన కార్యక్రమం కొంత సత్ఫలితం ఇవ్వడంలో మరోమారు ఇప్పుడు అదే పనిగా మొక్కలునాటే కార్యక్రమం చేస్తున్నారు. గతేడాది నల్లగొండ,మహబూబ్‌నగర్‌ రూట్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటించారు. ఓ ఐదారేళ్లు ఇలా నాటుతూ, సంరక్షిస్తూ పోతే రోడ్లకు ఇరనువైపులా పచ్చదనం పరచుకోనుంది. ఇందుకు అటవీశాఖకు కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు అధికారులు రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు నాలుగవ విడత హరితహారం కార్యక్రమానికి పెద్ద మొక్కలను నర్సరీల్లో పెంచాలని అటవీశాఖ ఇచ్చిన ఆదేవౄల మేరకు మొక్కలు నాటుతున్నారు. అటవీశాఖకు సంబంధించిన సమగ్ర కార్యకలాపాలతో పాటు హరితహారం జరుగుతున్న తీరుతెన్నులు, లక్ష్యాలపై జిల్లా అటవీ శాఖాధికారులతో సవిూక్షించారు. హరితహారంలో ఇప్పటి వరకు నాటిన మొక్కల వివరాలు, నర్సరీల పరిస్థితి, ప్రస్తుతం పెంచుతున్న మొక్కల వివరాలు, సిబ్బంది హెడ్‌ క్వార్టర్‌లో ఉంటున్నారా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకుంటున్నారు. రహదారుల వెంట పెద్ద మొక్కలను నాటే విధంగా జిల్లాలోని నర్సరీల్లో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీడనిచ్చే పెద్ద మొక్కలను ప్రత్యేకంగా పెంచాలని ఖరారు చేశారు. ఇప్పటికే జిల్లాల్లో జరుగుతున్న హరితహారం కార్యక్రమం గురించి ఆరా తీసారు. లక్షలపెద్ద మొక్కలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించి కార్యాచరణ చేపడుతున్నారు. దీంతో రోడ్డకిరువైపులా నీడతో పాటు ఏపుగా పెరిగేలా మొక్కలను నాటుతున్నారు. ఇలా నాటిన మొక్కలను సంరక్షించేలా రహదారుల భవనాల శౄఖ చర్యలు తీసుకోనుంది.