రాక్షసానందం!

– హరికృష్ణ ప్రాణాలతో పోరాడుతుంటే సెల్ఫీ దిగిన ఆస్పత్రి సిబ్బంది
– మండిపడుతున్న నేటిజర్లు
హైదరాబాద్‌, ఆగస్టు31(జ‌నం సాక్షి) : సెల్ఫీ పిచ్చి పీక్స్‌కు చేరింది.. ఈ సెల్ఫీ పిచ్చితో కొంతమంది ప్రాణాలు తీసుకుంటుంటే.. మరికొంత మంది తమ కళ్లెదుటే ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా రాక్షసానందం పొందుతున్నారు. మరీ ముఖ్యంగా.. సెలబ్రిటీతో సెల్ఫీ తీసుకునే అవకాశం వస్తే తమనుతామే మర్చిపోయి కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో సెల్ఫీ దిగాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. రెండు రోజుల క్రితం కామినేని ఆస్పత్రిలో హరికృష్ణకు చికిత్స అందిస్తున్న సమయంలో ఇటువంటి ఘటనే జరిగింది. తీవ్రంగా గాయపడిన హరికృష్ణను కామినేని ఆస్పత్రికి తీసుకురాగా.. క్షణాల్లో లైఫ్‌ సపోర్టు విూద ఉంచాల్సిన సిబ్బంది సెల్ఫీలు తీసుకుంటూ కాలం గడిపారు. హరికృష్ణకు చికిత్స చేస్తున్న సమయంలో ఈ సెల్ఫీలు తీసుకున్నారా.. లేక .. మరణించాక పార్థివ దేహంతో తీసుకున్నారా అనేది తెలియనప్పటికీ.. ఈ సెల్ఫీలు బయటకు రావడం సంచలనంగా మారింది. ఈ ఫొటోలు వైరల్‌గా మారడంతో ఆస్పత్రి సిబ్బందికి చీవాట్లు పెడుతున్నారు.  సిబ్బంది తీరుపై నేటిజర్లు మండిపడుతున్నారు. ఇదేం రాక్షసానందం అంటూ కామెంట్లతో మండిపడుతున్నారు.

తాజావార్తలు