రాజకీయ విధానమే ముఖ్యం : సురవరం

ఆదిలాబాద్‌ : యూపీఏ ప్రకటించిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీపట్ల తమకు గౌరవం ఉందని, అయితే గౌరవం, స్నేహం కంటే రాజకీయ విధానమే మతకు ముఖ్యమని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలో  వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలు ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ గౌరవం, స్నేహం ఉందన్న కారణంతో పార్టీలో చర్చించకుండా రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించలేమన్నారు. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపే విషయంలో ఈనెల 21న నిర్వహించనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చించిన నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.  అమెరికాకు భారత్‌ స్నేహం పేరుతో లొంగిపోయిందని,  ఆ దేశం విధించే అన్న షరతులను భారత్‌ అంగీకరిస్తోందని సురవరం ఆగ్రహం వ్యక్తం చేశారు.