రాజీవ్‌ బాటలో ముందుకు సాగాలి: ఉప ముఖ్యమంత్రి

మెదక్‌: రాజీవ్‌ చూపిన బాటలో యువత ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. విద్యారంగంపైన, సాంకేతిక ప్రగతిపైన రాజీవ్‌కు ఆనాడే స్పష్టమైన అవగాహన ఉండేదని ఆ ప్రకారమే ఆయన ముందుకుసాగారని గుర్తుచేశారు. సంగారెడ్డిలో జరిగిన రాజీవ్‌గాంధీ 68వ జయంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన ప్రభుత్వ వివ్‌ జగ్గారెడ్డి రాజీవ్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. నివాళులు ఆర్పించారు. అనంతరం జిల్లాకేంద్ర ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. మెదక్‌ జిల్లాకు మెడికల్‌ కాలేజి మంజూరు చేయిస్తానని ఆయన హామి ఇచ్చారు.