రాజేంద్రనగర్ టీఆర్ఎస్ సమావేశం రసాభాస
హైదరాబాద్: రాజేంద్రనగర్ టీఆర్ఎస్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి సంబంధించిన ఫ్లెక్సీల్లో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుల ఫొటోలను వేయకుండా కొత్తగా పార్టీలోకి వచ్చినవారి ఫొటోలను వేస్తున్నారని కార్యకర్తలు గొడవపడ్డారు. మంత్రి మహేందర్రెడ్డి ముందే కార్యకర్తలు వాగ్వాదానికి దిగడం విశేషం.