రాజ్యసభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళన  కొనసాగుతోంది. ఉదయం వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌  చేశాయి. సభ్యులు శాంతించకపోవడంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.