రాత్రి 7 గంటల తర్వాత కూడా కవాతు కొనసాగుతుంది: కోదండరాం

హైదరాబాద్‌: ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత కూడా కవాతు కొనసాగుతుందని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలిపారు. నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పోలీసులు అణిచివేత ధోరణి మానుకోవాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయాని హెచ్చరించారు. తెలంగాణ ఇచ్చే వరకూ ఇక్కడే కూర్చుందామని తెలంగాణ వాదులకు సూచించారు.