రానున్న మూడు రోజులు తీవ్రమైన వడగాలులు

break118_sun-heat

రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని 10 జిల్లాలకు వడగాలుల ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మూడు రోజులు అన్ని ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు ఉంటాయని పేర్కొన్నది. ఎండ తీవ్రత, వడగాలులు ఎక్కువగా ఉంటున్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పగటి పూట బయట తిరగొద్దని సూచించింది.
మరోవైపు, రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. నల్గొండ 45.2, రామగుండం, ఖమ్మం 45, భద్రాచలం 44.2, హైదరాబాద్ 42.7, రాష్ర్టంలోని మిగతా చోట్ల 42 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నాయి.