రామన్న మృతదేహంతో ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

వరంగల్‌: ఇరు వర్గాల మధ్య ఘర్షణలో మృతి చెందిన తెదేపా కార్యకర్త రామన్న మృతదేహంతో మర్రిపెడ మండలం తాళ్లవూకల్‌ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.