రామాంతాపూర్‌లోని ఎస్‌.వి డిగ్రీ కళాశాలలో గ్రూప్‌4 అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌: పేపరు లీకైయిందని రామాంతాపూర్‌లోని ఎస్‌.వి డిగ్రీ కళాశాలలో గ్రూప్‌4 అభ్యర్థుల ఆందోళనకు దిగారు. మొదటి పరిక్షలో వి.కృష్ణ అనే అభ్యర్థి ప్రశ్నపత్రం తీసుకున్న తర్వాత బయటకు వెళ్లి 150మార్కుల జవాబులను ఓ తెల్లకాగితంపై రాసుకొచ్చాడని, కాలేజీ యాజమాణ్యం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుందని ఆరోపించారు. దీంతో కృష్ణా అనే అభ్యర్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనివద్ద నుండి 150మార్కులు కలిగిన పత్రాన్ని స్వాధినం చేసుకున్నారు.