రామానాయుడుకు గవర్నర్‌, ముఖ్యమంత్రులసంతాపం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 : ప్రముఖ నిర్మాత రామానాయుడు మృతి పట్ల గవర్నర్‌ నరసింహన్‌, రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. అలాగే కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఏపీ స్పీకర్‌ కోడెల, ఏపీ మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, మంత్రి పల్లె, ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, శ్రీరాం మాల్యాద్రి సంతాపం తెలిపారు.