రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటు

హైదరబాద్‌:రాష్ట్రాన్ని ఉంచితే సమైఖ్యంగా ఉంచాలని లేకపోతే మూడు ముక్కలు చేసి ప్రత్యేక రాయలసీమ ఇవ్వాలని తెదేపా నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. హైదరబాద్‌లో అయన రాయలసీమ నేతలతో కలిసి రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అనంతరం మర్రిచెట్టు బొమ్మతో ఉన్న జెండాను అవిష్కరించారు. సీమలోని అధ్యాత్మిక గురువులు, చరిత్రలో నిలిచిన మహనుభావులు ఫోటొలను ఈ జెండాలో ముద్రించారు. సీమవాసులు అన్నివిధాలుగా నష్టపోయారని, త్యాగాలతో అన్ని పోగొట్టుకున్నారని బైరెడ్డి అవేదన వ్యక్తం చేశారు. సీమలోని కొన్ని జిల్లాలను విడదీసి తెలంగాణలో కలుపుదామని చెప్పేవాళ్లని ఉన్మాదులుగా పేర్కోన్నారు. రాయలసీమ పరిరక్షణ సమితి ఉద్యమానికి పార్టీ అడ్డొస్తే రాజీనామా చేయడానికి కూడా సిద్దమని చెప్పారు.