రాయితీ సిలిండర్లు తొమ్మిదికి పెంపు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 11 (జనంసాక్షి) :

గ్యాస్‌ వినియోగదారులకు తీపి కబురు. గృహ వినియోగదారులకు సబ్సిడీ సిలిండర్ల పరిమితి ఆరు నుంచి తొమ్మిదికి పెంచు తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమోయిలీ మంగళవారం ప్రకటిం చారు. ఇంతకు క్రితం వినియోగదారులకు ఎలాంటి పరిమితి లేకుండా సబ్సిడీపై సిలిండర్లు ఇచ్చేవారు. అవి దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలతో యేడాదికి ఆరు సిలిండర్లు మాత్రమే పంపిణీ చేస్తామని కేంద్రం   ప్రకటించింది. ఈమేరకు పెట్రోలియం శాఖ చమురు సంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రజలపై ప్రభావం చూపేలా ఉన్న సిలిండర్ల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.