రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పుకార్ల షికారు
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం అర్ధరాత్రి పుకార్లు షికారు చేశారు. పడుకుంటే చనిపోతారంటూ వదంతులు వ్యాపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ వదంతులు హైదరాబాద్, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పెద్దయెత్తున వ్యాపించడంతో ప్రజలు రాత్రంతా చిన్నారులతో సహా జాగారం చేశారు.