రాష్ట్రంలో అట్టడుగున విద్యాప్రమాణాలు: జేపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయని, ప్రమాణాలు పాటించని విద్యాసంస్థలను జాతీయం చేయాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. సమస్యను పక్కదోవ పటించేందుకే బోధన రుసుం విషయంలో ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని, ప్రస్తుత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానం  ప్రైవేటు విద్యా సంస్థల మనుగడకోసమేనని ఆయన ఆరోపించారు. అర్హులైన విద్యార్థుల చదవుకు ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని జేపీ అన్నారు.