రాష్ట్రంలో కరెంట్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి:టీడీపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరెంట్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందని టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌ విమర్శించారు. గ్రామాల్లో 10నుంచి12గంటలు కోత విదిస్తున్నారని అన్నారు. ఎప్పుడు లేని విధంగా హైదరాబాద్‌లో గంటల కొద్ది విద్యుత్‌ కోత విదిస్తున్నారని మహారాష్ట్రకు గాయ్సన కేటాయించడానికి మన ప్రయోజనాలను పణంగా పెట్టారని, కేజీ బేసిన్‌ గ్యాస్‌ను మహారాష్ట్రకు ఎలా కేటాయిస్తారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎంపీల చేతకాని తనంతో గ్యాస్‌ తరలిపోందని అన్నారు. 8ఉళ్ల పాలనలో ఒక్క ప్రాజేక్ట్‌ అయినా సాధించారా అని ప్రశ్నించారు.