రాష్ట్రంలో తుపాను విపత్తుల నుంచి రక్షణకు పటిష్ఠ వ్వవస్థ ఏర్పాటు

హైదరాబాద్‌: లేక్‌వ్యూ అతిధి గృహంలో జాతీయ విపత్తు నిర్వహణ అధారిటీ సమీక్షా సమావేశం నిర్వహించింది. తుపాను, ఇతర విపత్తుల వల్ల రాష్ట్రంలో చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించారు. కోస్తా జిల్లాల్లో రూ.758కోట్లతో 215కల్లా పటిష్ఠవ్వవస్థ ఏర్పాటు చేయాలని తొలిదశ కింద రూ.32కోట్లతో పౌరులకు అవగాహన వ్వవస్థ ఏర్పాటు చేయాలని, టెండరు ప్రక్రియ డిసెంబరు ఆఖరుకల్లా పూర్తి చేయాలని జాతీయ విపత్తు నిర్వహణ అధారటీ నిర్ణయం తీసుకుంది.