రాష్ట్రపతిగా పోటీచేసేందుకు కలాం నిరాకరణ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి పోటిచేసెందుకు అబ్దుల్‌ కలాం నిరాకరించారు.తృణమూల్‌ భాజపాలు ఈ విషయంపై తీవ్రంగా బత్తిడిచేయటంతో ఆయన ఈ రోజు సాయంత్రం దీని పై స్వయంగా  ప్రకటన చేశారు. మమతాబెనర్జీకి తనపట్ల  నమ్మకం ఉంచినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.పోటీచేసేందుకు తన మన్ససాకి అంగీకరించటంలేదని ఆయన ఓ ప్రకటనలో తెలియజేశారు. భాజపా తరపున కూడా ఆ పార్టీ నేత సుదీంద్ర కులకర్ణి ఈ రోజు రెండుసార్లు  అబ్దుల్‌ కలాంను కలిసి ఒప్పించేందుకు ప్రయత్నించారు. భాజపా అగ్రనేత ఆద్వానీ కూడా కలాంతో ఫోన్‌లో మాట్లాడగా ఆయన తాను పోటికి  అంగీకరించటంలేదని చెప్పారని సమాచారం అందింది.