రాష్ట్రపతితో తెలంగాణ మంత్రుల భేటీ

హైదరాబాద్‌ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. మంత్రులు గీతారెడ్డి, సబిత, శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, సారయ్య, సునీతా లక్ష్మారెడ్డి రాష్ట్రపతిని కలిసి తెలంగాణ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. తెలంగాణ అంశాన్ని సత్వరమే పరిష్కరించాలని విన్నవించారు. సమస్య గురించి తనకు అన్ని విషయాలు తెలుసని తమతో ప్రణబ్‌ అన్నట్లు భేటీ అనంతరం మంత్రులు తెలిపారు. ఈ అంశంలో త్వరలోనే నిర్ణయం వస్తుందన్న ఆశాభావావం వ్యక్తం చేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఢిల్లీ అత్యాచార ఘటనను రాష్ట్రపతి ప్రస్తావిస్తూ మహిళలకు భద్రత కల్పించాలని మంత్రులకు తెలిపారు.