రాష్ట్రపతి ఎన్నికలో ఎంఐఎం ఓట్ల కోసం

అసదుద్దీన్‌తో బొత్స భేటి
హైదరాబాద్‌,జూలై 17(జనంసాక్షి): అందరూ ఊహించినట్లే జరిగింది. రాజకీయంగా ఎప్పుడు తనకు ఆపద వచ్చే సూచనలు కనిపించినా, కాంగ్రెస్‌ ఎప్పుడూ తీసుకునే నిర్ణయమే ఇప్పుడూ తీసుకుంది. రాష్ట్రపతి ఎన్నికలో తమ పార్టీ బలపరుస్తున్న ప్రణబ్‌ ముఖర్జీకే ఓటు వేయాలని ఎంఐఎంను కోరింది. ఈ మేరకు పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ మంగళవారం ఎంఐఎం శాసన సభ ఫ్లోర్‌ లీడర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీని కలిసి మద్దతివ్వాలని అభ్యర్థించారు. ప్రణబ్‌కే ఓటు వేసేలా అక్బరుద్దీన్‌ చర్యలు తీసుకోవాలని బొత్స కోరారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ ఎంఐఎం తమకు మద్దతునిస్తుందని ఆశా వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి బుధవారం జరిగే సీఎల్పీ సమావేశానికి శాసనస భ్యులందరూ తప్పక హాజరు కావాలని ఆదేశించారు. రాష్ట్రపతి ఎన్నికలో ఓటు ఎలా వేయాలన్న దానిపై చర్చ, మాక్‌ పోలింగ్‌ నిర్వహించనున్నట్లు వివరించారు.