రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో నేడు సీఎల్పీ భేటీ

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం నేడు సమావేశం కానుంది. జూబ్లీహాల్లో జరుగనున్న ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎమ్మేల్యేలకు విందు ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌ విధానం గురించి సభ్యులకు వివరించనున్నారు. నమూనా ఓటింగ్‌ కూడా నిర్వహిస్తారు.