రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈనెల 16న రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సంపత్‌ తెలిపారు.30న నామినేషన్ల దాఖలుకు చేవరి తేది. జూలై 2న నామినేషన్ల పరిశీలన, 4న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు, 19 రాష్ట్రపతి ఎన్నిక, 22న ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితం వెల్లడిస్తామని ఆయన తెలిపారు.  ఈ ఎన్నికలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించనున్నట్టు సంపత్‌ వెల్లడించారు.