రాష్ట్రపతి పదవికి ప్రణబ్‌ అర్హుడు : సోనియాగాంధీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి ప్రణబ్‌ను మించిన అర్హులు లేరని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ రోజు కేంద్ర మంత్రిగా ప్రణబ్‌కు వీడ్కోలు చెబుతూ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రపతిగా ప్రణబ్‌భారీ మెజార్టీతో గెలుస్తారని ఆమె జోష్యం చెప్పారు. కాగా కేంద్ర మంత్రి పదవికి ప్రణబ్‌ ముఖర్జీ రేపు రాజీనామా చేయనున్నారు. ఈ నెల 28న ఆయన యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్నారు.