రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సత్తా సురాజ్య ఉద్యమం

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా మంచి రాజకీయం సుపరిపాలన లక్ష్యంగా లోక్‌సత్తా చేపడుతున్న సురాజ్య ఉద్యమం గురువారం నుంచి ప్రారంభం కానుంది. లోక్‌సత్తా ప్రజీస్వామ్య సంస్కరణల పీఠం అధ్వర్యంలో చేపట్టే ఈ ఉద్యమంలో మంచి రాజకీయం, సుపరిపాలనపై ప్రజలకు అవగాహన కల్సిస్తారు. ఆగస్టు 9న క్విట్‌ ఇండియా డేను కరప్షన్‌ డేగా నిర్వహించాలని లోక్‌సత్తా నిర్ణయించింది. రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ హాల్లో పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ సమన్వయకర్తగా ఉదయం 10 గంటలకు జరిగే రౌండ్‌టేబుల్‌ సమావేశంలో న్యాయకోవిదులు, పౌరసమాజ ఉద్యమాలు, అవినీతి నిరోధక సంస్థల్లో విశేష అనుభవం గల ప్రముఖులు పాల్గొంటారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే సాయంత్రం 6 గంటలరే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సురాజ్య ఉద్యమంపై బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.