రాష్ట్ర ఖనిజాభివృద్ధిసంస్థకు ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేయాలి: కిశోర్‌

న్యూఢిల్లీ: విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులు నిలిపివేయాలని కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాశారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధిసంస్థకు ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేయాలని కోరుతూ గతంలోనే రాష్ట్ర గవర్నర్‌ దృష్టికి తీసుకు వెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.